top of page

కారేపల్లిలో ఘనంగా Amity India సోలార్, ఈవీ & ఆయుర్వేద Franchise ప్రారంభించిన గౌ. వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ గారు!

  • May 8
  • 1 min read


కారేపల్లి: మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ గ్రామీణ ప్రాంతాలు సైతం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయని వైరా శాసనసభ్యులు (ఎమ్మెల్యే) మాలోత్ రాందాస్ నాయక్ పేర్కొన్నారు.


పర్యావరణ హితంగా సోలార్, ఈవీల వినియోగం: కారేపల్లిలోని డీసీసీబీ బ్యాంకు సమీపంలో

Mr. హనుమకొండ రమేష్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన 'అమిటీ ఇండియా' Franchise 'శ్రీ లక్ష్మీ వేద్ ఆర్యన్' ఈవీ (ఎలక్ట్రిక్ వెహికల్స్), సోలార్ & ఆయుర్వేదిక్ కేంద్రాన్ని ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూంలోని ఎలక్ట్రిక్ వాహనాలను ఆయన స్వయంగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పెరుగుతున్న ఇంధన ధరలు మరియు కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గుచూపాలని పిలుపునిచ్చారు.


కమర్షియల్, ఇండస్ట్రియల్ సముదాయాల్లో పెరుగుతున్న కరెంటు బిల్లులకు ప్రత్యామ్నాయంగా సోలార్ విద్యుత్ వినియోగం ఎంతో లాభదాయకమని సూచించారు. పునరుత్పాదక ఇంధన వనరుల వాడకం వల్ల తక్కువ ఖర్చుతోనే నాణ్యమైన విద్యుత్ లభిస్తుందన్నారు. కరోనా విపత్తు తర్వాత ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరిగిందని, మెరుగైన ఆరోగ్యం కోసం అమిటీ ఇండియా వంటి నాణ్యమైన ఆయుర్వేద ఉత్పత్తులను వినియోగించాలని కోరారు. ఇలాంటి ఆధునిక వ్యాపార సంస్థలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభం కావడం వల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నాణ్యమైన సేవలను, ఉత్పత్తులను సరసమైన ధరలకు ప్రజలకు అందించడమే తమ లక్ష్యమని నిర్వాహకులు

Mr. హనుమకొండ రమేష్ ఈ సందర్భంగా తెలిపారు.


ఈ కార్యక్రమాల్లో ఎస్ఐ Mr బైరు గోపి, సొసైటీ డైరెక్టర్ దుగ్గినేని శ్రీనివాసరావు, సర్పంచుల సంఘం అధ్యక్షుడు భూక్యా రంజిత్ కుమార్, సర్పంచ్ మేదరి వీరప్రతాప్ (టోనీ), హట్కార్ రాంబాబు, భూక్యా బాలు, బాణోత్ రామ్మూర్తి నాయక్, అడ్డగోడ ఇలయ్య, Amity India Senior Pomoters Mr తిరువెంగళయ్య, Mr వంకుడోత్ శేఖర్, Mr వంకుడోత్ నరేష్ & Mr బంతు ఐలయ్య గారు తదితర ప్రతినిధులు, గ్రామస్తులు, వ్యాపార ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.



Amity India News Bulletin Desk_0705261929


 
 
 

Comments


Contact us:
Email: hello@amityev.com
Address: #302, Ritesh Towers

Karkhana Junction,

Secunderabad-500015

Telangana. India

Subscribe to Our Newsletter

Connect With Us

  • Whatsapp
  • Facebook
  • Youtube

Disclaimer : Under no circumstances shall company or its affiliates be liable for indirect, incidental, consequential, special or exemplary damages arising out of any communication or commitment or false representation made by any person on behalf of company. Actual product color may vary from the website Image.

© 2025 by AmityIndia.net - All rights reserved.

bottom of page